calender_icon.png 22 February, 2026 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి మృతి

14-12-2025 11:09:35 AM

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో(Khammam district) సర్పంచ్ అభ్యర్థి దామాల నాగరాజు మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం అనాసాగర్ లో నాగరాజు సర్పంచ్ అభ్యర్థిగా(Sarpanch candidate) పోటీ చేస్తున్నాడు. నాగరాజు సర్పంచ్ కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. నిన్న సాయంత్రం దామాల నాగరాజు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. ఎన్నికల ప్రచారంలో ఒత్తిడికి గురై అభ్యర్థి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున నాగరాజు మృతి చెందాడు. పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థి నాగరాజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమై కొనసాగుతోంది. 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు సభ్యుల స్థానాల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాలలో 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రాంరభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.