కారు బైకు డీ: ఇద్దరి మృతి
ఉట్నూర్, జూన్ 18( విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్ గ్రామపంచాయతీ శివారులో కారు బైకు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై సాయన్న, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన ఆడే ప్రకాష్(50), రాంజీ రాథోడ్ (70) ద్విచక్ర వాహనం తో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగానే ఫంక్షన్ హాల్ లో పెళ్లి వేడుకలకు ప్రయాణం సాగిస్తున్నారు.
అదే సమయంలో జై నూరు మండల కేంద్రం నుండి టీజీ 20 0051 కారు అతివేగంగా ఇంద్రవెల్లి వైపు వస్తున్న కారు బైకును ఢీకొంది. బైకు కారు రెండు అదుపుతప్పి కుడివైపు చాలా టేకు చెట్టు నుండి కొట్టాయి. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆడే ప్రకాష్, రాంజీ రాథోడ్ లను జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలించారు. రిమ్స్ ఆస్పత్రిలో వైద్యం పొందుతూ.. మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనలో కారు నడిపిస్తున్న డ్రైవర్ కు సైతం గాయాలు అయ్యాయని ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.






