18 June, 2026 | 6:55 PM

నాటు తుపాకీతో అడవిలో సంచరిస్తున్న నలుగురు అరెస్ట్

18-06-2026 05:54 PM

దమ్మపేట, జూన్ 18(విజయ క్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి బీట్ పరిధిలో అనుమానాస్పదంగా వేటకు వచ్చిన నలుగురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీట్ ఆఫీసర్ భవాని సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు నాటు తుపాకీతో ఫారెస్ట్ అధికారులకు తారసపడ్డారు.  అధికారులను చూసిన నిందితులు రెండు బైక్లు, నాటు తుపాకీ, ఆరు తూటాలు, టార్చ్ లైట్, బ్యాగ్ అక్కడే వదిలి పారిపోతుండగా ఫారెస్ట్ అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం నలుగురిని అరెస్టు చేసి వైల్డ్ లైఫ్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాసరావు తెలిపారు.