ప్రభుత్వ బడిలో సర్పంచ్ పిల్లల చేరిక
నంగునూరు, జూన్ 19: ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో భరోసా కల్పించేందుకు నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.మార్పు మన నుంచే మొదలవ్వాలనే సంకల్పంతో ఆయన తన సొంత పిల్లలను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో చేర్పించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన,అద్భుతమైన వసతులు ఉన్నాయని,కేవలం మాటలతో కాకుండా ఆచరణలో చూపిస్తేనే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపి డబ్బులు వృథా చేసుకోవద్దని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో హర్షణీయమని,దీనివల్ల బడిలో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాడ వీరారెడ్డి కొనియాడారు.






