calender_icon.png 18 January, 2026 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఘన సత్కారం

18-01-2026 06:52:40 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెండవ వార్డు సభ్యుడు మునిగె శంకర్ మాట్లాడుతూ... అంబేద్కర్ సంఘానికి సంబంధించిన సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లారు.

ముఖ్యంగా కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని సాయి కృష్ణ, ఉప సర్పంచ్ చీమల పరుశురాం మాట్లాడుతూ... అంబేద్కర్ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.