calender_icon.png 18 January, 2026 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

18-01-2026 06:47:59 PM

యువకులను ప్రోత్సహించడమే జనసేన లక్ష్యం

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 22 టీంలు పాల్గొన్నాయి. మొదటి బహుమతి జిశాన్ టీం, రెండవ బహుమతి జై భవాని టీం గెలుపొందాయి. విజయం సాధించిన ఇరుజట్లకు జనసేన సభ్యులు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ యువతను ప్రోత్సహించడంలో జనసేన పార్టీ ముందంజలో ఉంటుందని తెలిపారు. జనసేన ఆధ్వర్యంలో మరిన్ని టోర్నమెంట్ లు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి మద్దతు తెలిపారని వారు కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.