calender_icon.png 18 January, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు

18-01-2026 06:58:28 PM

జనగామ గ్రామానికి గర్వకారణం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా, బీబీపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన విద్యార్థులు డాకురు నిక్షిత, కుమ్మరి ధనుష్ కుమార్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ కరాటే  సెలక్షన్స్‌లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు. ఈ విజయంతో వారు వచ్చే ఏప్రిల్ నెలలో ముంబైలో జరగనున్న నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికయ్యారని గ్రాండ్ మాస్టర్ కామిండ్ల  రాజయ్య తెలిపారు. విద్యార్థుల ఈ ఘన విజయంలో కోచ్‌లు కేకే స్వామి, కోచ్ చింటూ వారి శిక్షణ కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. జనగామ గ్రామం పేరు రాష్ట్రస్థాయిలో వెలుగొందేలా చేసిన విద్యార్థులను గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందించారు.