09-01-2026 12:00:00 AM
మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి రవీందర్
కుషాయిగూడ, జనవరి 8 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని విధి భవిష్యత్ తరాలకు ఎంతో నష్టమని వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెల్మెట్ ప్రాణ రక్షణ కవచమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సివిల్ జూనియర్ జడ్జి రవీందర్ అన్నారు గురువారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈసీఐఎల్ లో కోర్టు నుండి వరకు ఈసీఐఎల్ వరకు రోడ్డు సురక్ష అభియాన్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, విద్యార్థులు, స్వచ్ఛంద సేవ కార్యకర్తలు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.