హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ సుభాష్ చంద్రబోస్
ముక్తాపూర్ పాఠశాలకు రూ.10 వేల విరాళం
నాగల్గిద్ద, జూలై 1: ఎన్నికల సమయంలో నాగల్గిద్ద మండలంలోని ముక్తాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని ఇచ్చిన హామీని గ్రామ సర్పంచ్ సుభాష్ చంద్రబోస్ నిలబెట్టుకున్నారు. ఆ హామీ మేరకు బుధవారం పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు (స్పోరట్స్ డ్రెస్సులు) కొనుగోలు చేసేందుకు రూ.10,000 నగదు విరాళాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబుశెట్టి గారికి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాబుశెట్టి, ఉపాధ్యా యులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని విద్యార్థుల అభివృద్ధికి చేయూ తనందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగల్గిద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్రావు పాటిల్, ఉప సర్పంచ్ పుండ్లిక్, వార్డు సభ్యులు యేసు, పీరప్ప, సూర్యకాంత్ పాటిల్, పుండ్లిక్, గ్రామ పెద్దలు కృష్ణ ప్రసాద్, జ్ఞానేశ్వర్, కె.పుండ్లిక్,శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






