వడ్డెర కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూలై 1 : ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ వడ్డెర కాలనీలో నెలకొన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరించడం జరుగుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లతో కలిసి కాలనీలో పర్యటించారు.
కాలనీ ప్రజలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, ఇంటి నంబర్ల అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ తరఫున ప్రత్యేక నిధులు కేటాయించి అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కాలనీలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
కాలనీలో నూతనంగా నిర్మించిన మునీశ్వర ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరవ వార్డు పరిధిలోని ఎస్వి హోమ్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆంజనేయులు, వెంకటేష్, కిషోర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, గద్దె రాజు, నవీన్ రెడ్డి, లత, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, బాబా, బండ రాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






