బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
- జూలై 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ ముస్కాన్ XII’
- జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్, జూలై 1 (విజయక్రాంతి): మెదక్ జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిది ద్దేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వ యంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, ఆపరేషన్ ముస్కాన్XII బృంద సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్XIIను సమర్థవంతంగా అమలు చేయాలని అధికా రులను ఆదేశించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో తప్పిపోయిన బాలలు, అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదంలో ఉన్న చిన్నారులు, బాల కార్మికులు, డ్రాప్‌అవుట్ పిల్లలు, వివిధ రకాల వేధింపులకు గురవుతున్న చిన్నారులను గుర్తించి రక్షించి, సంబంధిత శాఖల సహకారంతో పునరావాసం కల్పించనున్న ట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను ప్రో త్సహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రెస్క్యూ చేసిన బాలలను పనిలో పెట్టుకున్న యజ మానులపై కేసులు నమోదు చేయాలని, గతంలో బాల కార్మిక చట్టాల కింద కేసులు నమోదైన వ్యక్తులు మళ్లీ అదే నేరానికి పాల్పడితే కేసులతో పాటు బైండ్ ఓవర్ చర్యలు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావే శంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్ తదితరులు, చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు ఉప్పాల య్య, ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు, ఎల్సీపీఓలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ఎస్హెచ్వోలు, సీఐలు పాల్గొన్నారు.






