17 July, 2026 | 1:50 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

సార్థక్ పీడీఎస్ ఐదేళ్లు పొడిగింపు

28-05-2026 01:03 AM
  1. పథకానికి 25,530 కోట్లు కేటాయింపు
  2. కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, మే 27: దేశంలోని రేషన్ బియ్యం రవాణా, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ కోసం ఉద్దేశించిన ‘సార్థక్ పీడీఎస్ పథకం పొడిగింపునకు కేంద్రమంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 25,530 కోట్లను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని వివరాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు.

కేబినెట్ సమావేశంలో 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో భాగంగా ఈ కార్యక్రమం 2031 మార్చి 31 వరకు కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయించిందన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల రవాణా, రేషన్ డీలర్ల మార్జిన్ ఖర్చుల కోసం ఇచ్చే కేంద్ర సహాయక నిధుల నిబంధనలను సవరించాలని కూడా కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న నిధుల పంపిణీ విధానాన్నే మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 81.35 కోట్ల మంది రేషన్ పొందుతున్న వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. సార్థక్ పీడీఎస్ ద్వారా రాష్ట్రంలోపల రవాణా, నిర్వహణ, ఎఫ్‌పీఎస్ డీలర్ మార్జిన్ కోసం హామీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించడం, జరుగుతుందని కేంద్రమంత్రి వివరించారు.