17 July, 2026 | 2:07 PM

Breaking News

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •  

బంగాల్‌లో వరుస అరెస్టులు

28-05-2026 01:04 AM
  1. టీఎంసీ నేతలే టార్గెట్
  2. పాత కేసులపై కొత్త ప్రభుత్వం గురి

కోల్‌కతా, మే 27: గతంలో రాజకీయ అం డతో పోలీసులపైనే దాడులకు పాల్పడిన నేరగాళ్లకు ప్రస్తుతం పశ్చిమ బంగాల్ పోలీసులం టే సింహాస్వప్నమని తెలిసొస్తుంది.  బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా సువేం దు అధికారి నియమితులయ్యాక గూండాలు, రౌడీలు, టీఎంసీ నాయకుల బెదిరింపులకు చెక్ పెడుతున్నారు. అంతేగాక అవినీతి, అక్రమాలు, సరిహద్దు చొరబాట్లపై కఠినంగా వ్యవ హరిస్తున్నారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లో ము గ్గురు టీఎంసీకి చెందిన స్థానిక రౌడీలను పోలీసులు అరెస్టు చేస్తూ వీధుల్లో ఊరేగించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ముగ్గురిపై సరిగ్గా ఎన్నికలకు ముందు పోలీసులపై కాల్పులు జరపడం, బాంబులు విసరడం, దాడులు చేయడం వంటి అభియోగాలు నమోదై ఉన్నాయి. ఉత్తర హౌరాలో డాన్‌గా పేరు పొందిన ఆకాష్ సింగ్‌ను పోలీసులు లోదుస్తులపై నడిపించుకుంటూ, గుం డుకొట్టించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మరోవై పు ఈ వీడియోను పంచుకున్న స్థానిక బీజేపీ నేరాల పట్ల తమ ప్రభుత్వానికున్న ‘జీరో టాలరెన్స్’ విధానంగా పేర్కొంది. మే 7వ తేదీన జరిగిన హింసకు సంబంధించి టీఎంసీకి చెందిన షమీమ్ అహ్మద్‌ను ముంబై నుంచి అరెస్టు చేశారు.