15 March, 2026 | 10:37 AM

వైభవంగా సర్వజ్ఞ సృజనోత్సవ్ వేడుకలు

15-03-2026 12:00 AM

ఖమ్మం, మార్చి 14(విజయక్రాంతి): ఖమ్మం నగరం వీడీఓస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాల వారి ్షకోత్సవ వేడుకలు ‘సర్వజ్ఞ సృజనోత్సవ్’ పేరిట అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రజా కవి, సినీ గేయ రచయి త పద్మశ్రీ సుద్దాల అశోక్ తేజ, గౌరవ అతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీర జ పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నా గేంద్ర కుమార్, డైరెక్టర్ నీలిమతో కలిసి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థులు వివిధ  సాం స్కృతిక, సృజనాత్మక కళలతో పాల్గొని అ ద్భుతమైన ప్రదర్శనలు చూపారు.ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడు తూ  పిల్లల భవిష్యత్తు అనేది పాథ్రమికంగా తల్లిదండుల్ర ప్రోత్సాహంపైనే ఆధారపడి ఉంటుందని, వారు బాగుంటేనే పిల్లల జీవితాలు బాగుంటాయని ఉద్గాటించారు. ము ఖ్య అతిథి సుద్దాల అశోక్ తేజ ప్రసంగిస్తూ ‘మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి.. చదువును కష్టపడి కాకుండా, ఇష్టపడి చదవాలి’ అని సూచించారు.

సర్వజ్ఞ వంటి గొ ప్ప విద్యాసంస్థలు పిల్లల లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికిసర్వజ్ఞ ఒక ‘రైట్ ఛాయిస్’ అని పాఠశాల విశిష్టతను కొనియాడారు. చైర్మన్ ఆర్‌వీ నాగేంద్ర కుమార్ మాట్లాడు తూ సర్వజ్ఞ  కేవలం పుస్తక జ్ఞానానికే పరిమి తం కాకుండా, విద్యార్థుల్లోని సృజనాత్మ కతను వెలికితీయడమే లక్ష్యంగా పనిచేస్తోం ది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థు లు అని రంగాల్లో  రాణించేలా మేము ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు.

డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతుంది. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దడమే మా ధ్యేయమన్నారు.   పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.