2 June, 2026 | 6:07 PM

Breaking News

కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •   అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు   •   పారమితలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   విద్యార్థుల ప్రాణ త్యాగాలు.. కెసిఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు   •   పెద్దకాపర్తిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   వాడవాడలా తెలంగాణ అవతరణ వేడుకలు   •   సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం   •  

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్

02-06-2026 05:27 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ జి. చంద్రమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఉద్యమం ప్రజల ఆకాంక్షల ఫలితమని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్లు వి. బ్రహ్మచారి, ఎన్. చంద్రకళ, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్లు తిరుమలరావు, శిరోమణి, క్షేత్రస్థాయి సిబ్బంది, అటవీ కార్మికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత పచ్చదనంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వేడుకలు ముగిశాయి.