2 June, 2026 | 6:03 PM

Breaking News

కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •   అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు   •   పారమితలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   విద్యార్థుల ప్రాణ త్యాగాలు.. కెసిఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు   •   పెద్దకాపర్తిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   వాడవాడలా తెలంగాణ అవతరణ వేడుకలు   •   సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం   •  

పార్లమెంట్‌లో నాటి 39 మంది బీఎస్పీ ఎంపీల మద్దతు వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం

02-06-2026 05:24 PM

* బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఇబ్రాం శేఖర్

​రంగారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక బహుజన సమాజ్ పార్టీ పోషించిన చారిత్రక పాత్రను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... నాటి పార్లమెంట్‌లో కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఒంటరిగా తెలంగాణను సాధించడం అసాధ్యమని స్పష్టం చేశారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలాంటి బేరసారాలు లేకుండా తెలంగాణ బిల్లుకు బేషరతు మద్దతు ప్రకటించారని తెలిపారు. ​లోక్‌సభలో 21 మంది, రాజ్యసభలో 18 మంది చొప్పున మొత్తం 39 మంది బీఎస్పీ ఎంపీల బలమైన మద్దతుతోనే తెలంగాణ బిల్లు చట్టబద్ధంగా ఆమోదం పొందిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 1200 మంది అమరవీరులలో 90 శాతం మంది బహుజన బిడ్డలేనని, కానీ రాష్ట్రం వచ్చాక ప్రాంతీయ పార్టీలు బీఎస్పీ క్రెడిబిలిటీని తొక్కిపెట్టాయని ఆరోపించారు. పదేళ్లు ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బహుజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో అమరవీరుల ఆశయాల సాధనకై సామాజిక న్యాయంతో కూడిన 'బహుజన తెలంగాణ' నిర్మించడమే లక్ష్యంగా బీఎస్పీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని ఇబ్రాం శేఖర్ ప్రకటించారు.