యుఎస్ ట్రేడ్ డిల్‌ను పునరుద్ధరించాలి
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యా గ్రహ దీక్ష
రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి
జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి రోషిని జైస్వాల్
కామారెడ్డి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): యూఎస్ ట్రేడ్ డిల్ వల్ల దేశీయ రైతులు, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతాయని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి రోషిని జైస్వాల్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య గ్రహా దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. యూఎస్ ట్రేడ్ డీల్ ను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.
యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల దేశీయ రైతులు వ్యవసారంగం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల విదేశీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం లభించి స్థానిక ఉత్పత్తులు రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూఎస్ ట్రేడింగ్ లో వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఈ సత్యాగ్రహ దీక్షలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొని నిరసనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సర్దార్, ఇమ్రోజ్, ఎన్ ఎస్ యు ఐ అద్యక్షులు ఐరేని సందీప్ కుమార్, జిల్లా కార్యదర్శులు అజ్మత్, అన్వేష్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






