calender_icon.png 6 December, 2024 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి

16-10-2024 12:54:53 AM

మునుగోడు, అక్టోబర్ 15: ఫ్లొరైడ్ విముక్తి పోరట యోధుడు అంశల స్వామి తండ్రి సత్యనారాయణ అంత్యక్రియలు నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని ఆయన స్వగ్రామం శివన్నగూడెంలో మంగళవారం ముగిశాయి. పలువురు ప్రముఖులు హాజరై మృతదేహం వద్ద నివాళులర్పించారు. సత్యనారాయణ పిల్లలు ఫ్లోరోసిస్‌కు బలికావడంతో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకుంట్ల సుభాష్‌తో కలసి 35 సంవత్సరాలు ఉద్యమం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. అంత్యక్రియల్లో అభిమానులు, మండలంలోని వివిధ నాయకులు పాల్గొన్నారు.