calender_icon.png 18 February, 2026 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది నాటికి సిద్ధం కానున్న సనత్‌నగర్ టిమ్స్.. మంత్రి సమీక్ష

17-02-2026 10:03:16 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను పర్యవేక్షించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉనతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్ష. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి. హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని సూచన ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో పూర్తిస్థాయి పరిశీలన చేయాలి.


అగ్నిమాపక‌శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి.. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి..పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఓపీ, ఫార్మసీ కౌంటర్లు ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి.సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించిన మంత్రి.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలి.


ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో అన్ని హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన  వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి సూచించారు.ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్, డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.