17-02-2026 10:08:09 PM
వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వగ్రామం ప్రతాపసింగారంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొని మాజీ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సుధీర్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జన్మదిన సందర్భంగా ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ చైల్డ్ గైడెన్స్ సెంటర్ లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు మధ్యాహ్న భోజనం అందించారు. మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మేడ్చల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, రైతు సమితి మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి,
మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, కడపోల్ల మల్లేష్, సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొంతం అంజిరెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కందుల కుమార్, ఘట్ కేసర్, పోచారం డివిజన్ ల కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శులు బర్ల రాధాకృష్ణ, మెట్టు గణేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, కేశపావుల వినోద్, బద్దం కుమార్, బంధుమిత్రులు, అభిమానులు ఉన్నారు.