15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

నారాయణరావుపేటలో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

17-02-2026 09:21 PM

బుగ్గరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

సిద్దిపేట రూరల్: తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి మండల శాఖ ఆధ్వర్యంలో నారాయణరావుపేటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వయంభూ బుగ్గరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మండల శాఖ నాయకులు కొనాయగారి ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కుంబాల ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు బాలమల్లు, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, పూసల కిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు హాజరై కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.