calender_icon.png 12 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూమిని కాపాడండి సార్!

12-07-2025 01:59:36 AM

  1. కాంపౌండ్ వాల్ కూల్చేసి మరీ కబ్జా
  2. బోరు మోటర్ ఎత్తుకెళ్లిన వైనం
  3. సిరిసిల్లకు చెందిన ఓ షాపింగ్మాల్ యజమాని  ఆగడాలు?

రాజన్న సిరిసిల్ల, జూలై 11(విజయక్రాంతి): అక్రమార్కుల నుంచి తమ భూమి విడిపించండి అని ఓ బాధితుడు అధికారులకు మొర పెట్టుకున్నాడు. ఓ షాపింగ్మాల్ యజమాని అనుచరుల ద్వారా తన భూ మిని కబ్జా చేసి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు. ప్రహరీని సైతం ధ్వంసం చేసి, బోరు మోటర్ ఎత్తుకెళ్లారని ఆందోళన వ్యక్తంచేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..

సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆడెపు హరీశ్ వేములవాడ మండలం మారపాక శి వారులో 359 సర్వే నంబర్లో పన్నెండేళ్ల క్రి తం నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ నిర్ధారించిన డాక్యుమెంట్ల ప్రకారం ఏడి అధికారి కొ లిచిన కొలతల ఆధారంగా మెదులుకుంటున్నారు. ఆ ప్లాట్ల లోపల బోరు వేసుకుని, చు ట్టూ ప్రహరీ సైతం నిర్మించుకున్నారు.

అయితే గుర్రంవారిపల్లెకు చెందిన కంది రాజిరెడ్డి, తడకమడ్ల హరిరెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి, గుర్రం సతీశ్రెడ్డి అనే వ్యక్తులు అక్రమంగా త మ ప్లాట్లోకి చొరబడి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. గోడలను కూలగొ ట్టి బోరు మోటర్ను ధ్వం సం చేసి ఎత్తుకెళ్లారని వాపోయా రు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కల నుంచి తమ ప్లాట్లను విడిపించి న్యాయం చేయగలరని కోరుతున్నారు.

వీరి వెనుక సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ షాపింగ్ మాల్ యజమాని ఉన్నారని బాధితుడు ఆరోపించారు. తమ భూమి తమకు అప్పగించేలా చర్యలు తీసుకుని న్యాయం చే యాలని బాధితుడు కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్, కలెక్టర్కు విజ్ఞప్తిచేశారు.

అధికారులకు ఫిర్యాదు చేసిన మరో బాధితుడు

వేములవాడ మండలం మల్కపేట గ్రా మానికి చెందిన జవాజి అంజయ్య అనే వ్యక్తి సైతం మారపాక శివారులోని తన ప్లాటును గుర్రంవారి పల్లెకు చెందిన కంది రాజిరెడ్డి, తడకమడ్ల హరిరెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి, గుర్రం సతీశ్రెడ్డి కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదుచేశారు. తాను కొనుగోలు చేసిన ప్లాట్లో అన్ని అనుమతులతో ఇంటి నిర్మా ణం చేపట్టమని తెలిపారు.

అయితే గుర్రంవారి పల్లికి చెందిన రాజిరెడ్డి, హరిరెడ్డి, లక్ష్మా రెడ్డి, సతీశ్రెడ్డి జేసీబీతో తన ప్లాటుకు వెళ్లే రోడ్డుపై కందకాలు తీశారని వాపోయాడు. తమ ప్లాట్లతో వారికి ఎలాంటి సంబంధం లేన్నా ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.