12-07-2025 01:40:40 AM
ఖమ్మంపల్లి లో లారీల పరిశీలించిన పెద్దపల్లి ఏడి శ్రీనివాస్
లారీల నిలిపివేతపై క్వారీ యాజమాన్యంపై ఏడి ఆగ్రహం
మంథని జూలై 11 (విజయక్రాంతి)ఖమ్మంపల్లి లో లారీలను నియంత్రిస్తామని, మంథని-ఖమ్మంపల్లి ప్రధాన రహదారిపై లారీల నిలిపివేతపై పెద్దపల్లి ఏడి శ్రీనివా స్ క్వారీ యాజమాన్యంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం ‘(వామ్మో లారీలు‘) విజయ క్రాం తి పత్రికల్లో ప్రచురితమైన వార్తకు స్పందించిన జిల్లా మైనింగ్ ఏడి శ్రీనివాస్ స్వయంగా శుక్రవారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామాన్ని సందర్శించి, లారీలను పరిశీలించారు.
ఖమ్మంపల్లి నుంచి సీతంపేట వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర లారీలు ప్రధాన రహదారిపై ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నారని, విజయక్రాంతి పత్రికల్లో రాగా, ఏడి శ్రీనివాస్ క్వారీ యాజమాన్యంతో మాట్లాడి లారీలను ని యం త్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ శివారులో ఖాళీగా ఉన్న అటవీ భూ ములలో లారీలను నిలిపివేయాలని, ప్రధాన రహదారిపై లారీలు నిలపడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని, లారీల నిలుపుదలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారని ఏడి సూచించారు.
భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ మండలంలోని పంకెన, ప లిమెల ఇసుక క్వారీలలో నీళ్లు రావడంతో అటువైపు లారీలు ఖమ్మంపల్లికి రావడం వల్ల లారీల సంఖ్య పెరిగిందని, లారీలను క్రమబద్దికరించి ప్రయాణికు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెం డు రోజుల్లో క్లియరెన్స్ చేస్తామని విజయక్రాంతికి ఏడి తెలిపారు. లారీలతో ప్రయాణికుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన విజయ కాంతి పేపర్ కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు