13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎస్‌బీఐ నూతన బ్రాంచ్ ప్రారంభం

26-03-2026 01:51 AM

భూపాలపల్లి (మహబూబాబాద్) మార్చి 25 (విజయక్రాంతి): ప్రజలకు బ్యాంకు సేవలు మరింత అందుబాటులో తెచ్చేందుకు మంజూరు నగర్ లో కొత్తగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బిఐ) నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు శాఖను కలెక్టర్ ప్రారంభించారు.

జిల్లా అభివృద్ధిలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించినందుకు కొత్త బ్రాంచ్ ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకు ద్వారా డిపాజిట్లు, రుణాలు, ఇతర లావాదేవీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఎల్ డి ఎం తిరుపతి, డీజీఎం గన్ శ్యామ్ సోలంకి, ఆర్.ఎం సుబ్బారావు, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.