26 March, 2026 | 3:40 AM

ఏక మొత్తంలో రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

26-03-2026 01:50 AM

హనుమకొండ, మార్చి 25 (విజయ క్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును  గౌరవిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ ఏప్రిల్ 9 లోగా చెల్లిస్తామని కోర్టుకు విన్నవించడం పట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో కన్వినర్ శ్రీదర్ల ధర్మేంద్ర హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఆధ్వర్యంలో  జిల్లా పరిషత్ లోనీ పీఆర్టియు భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ విడుదల చేయాలని ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోక పోవడం వలన కొంత మంది ఉద్యోగులు కోర్టు ను ఆశ్రయించగా హైకోర్టు 9 వారాల్లోగా చెల్లించాలని తీర్పు ఇవ్వగా, హై కోర్టు వెలువరించిన తాజా తీర్పు ప్రకారం వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల పాలిట ఒక ఆశల ఆయుధం అన్నారు.

ఏప్రిల్ 9 తేదీని తుది గడువుగా విధిస్తూ ఆలోగా పెండింగ్ లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెన్ఫిట్స్ చెల్లించాలని స్పష్టం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దేవదాసు, అబ్దుల్ గఫర్, దామోదర్, ఇంద్రసేనారెడ్డి, సారయ్య, కుమారస్వామి, విశ్వనాథం  పాల్గొన్నారు.