20 March, 2026 | 9:06 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి..

17-03-2025 10:28 PM

మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ రాజ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టాలని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి డిమాండ్ డిమాండ్ చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాదిగలకి శుభవార్త కాంగ్రెస్ ప్రభుత్వం వినిపిస్తుందని తెలంగాణలో ఉన్న మాదిగలంతా లక్షల కళ్ళతో ఎదురుచూస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తిమ్మన నవీన్ రాజ్, ఉపాధ్యక్షుడు ఎం కోటేశ్వరరావు, ఎంఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బి. ఉపేందర్ లు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అనుకూలమని, మొదటి నుంచి ఈసారి కచ్చితంగా మాదిగలకి ఈ  సమావేశాల్లోనే న్యాయం చేస్తారని మేము సంపూర్ణంగా ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నామన్నారు.

ఎస్సీ వర్గీకరణ చట్టంతో పాటు వెంటనే రానున్న జాబ్ నోటిఫికేషన్ అమలు జరగాలని, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఉద్యోగాలలో ఈ నోటిఫికేషన్లలో మాదిగ న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగలకు  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయి పదవులు లేవని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ప్రభుత్వ రంగాలైన ఉన్నతమైన రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కలెక్టర్ మాదిగ లేకపోవడం, రాష్ట్రంలో ఒక్క ఎస్పీ మాదిగ లేకపోవడం, ఆరోగ్య రంగంలో ఒక్క డిఎంహెచ్వో మాదిగ లేకపోవడం జడ్పీ సీఈవో లో మాదిగ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లుని చట్టం చేస్తూనే త్వరలో మాదిగ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి మాదిగ ఉద్యమకారులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాదిగ రాజ్యాధికార పోరాట సమితి హైదరాబాద్ జిల్లా మెడికల్ ల్యాబ్ అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్, యువసేన నాయకులు కొత్తపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు.