11-11-2025 12:23:04 AM
నారాయణపేట. నవంబర్,10(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ఏర్పడి ఐదు సంవత్సరాలు అయినా ఇంకా పలు కార్యాలయాలు, సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, అభివృద్ధి లేక వెనుక బడిన ప్రాంతాలుగా మిగిలిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా పేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు పాడు బడిన సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గత యాభై ఏళ్లుగా ఇదే భవనంలో ఎందరో బీద బడుగు వర్గాలకు చెందిన బాలురు,బాలికలు, వసతి గృహంలో నిర్వహణ కొనసా గింది. ఈ నేపథ్యంలో సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని సింగారం చౌరస్తాలో నిర్మాణం తర్వాత కొన్ని రోజులుగా అక్కడనే నిర్వహించారు . దీంట్లో భాగంగానే అక్కడి నుంచి విద్యార్థులు చదువుకోవటానికి రాక పోకడలు చేయటానికి గాను దళిత విద్యార్థులు చదువుకోవటానికి ఆపసోపనా పడిన సంఘటనలు కోకొల్లలు.
ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి చొరవతో జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ దామరగిద్ద మండలానికి మంజూరు చేయగా అక్కడ కొన్ని రోజులుగా కొనసాగించిన బిసి రెసిడెన్షియల్ స్కూల్ ను అనుకోకుండా నారాయణపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని అర్ధంతరంగా ఖాళీ చేయించి అదే భవన్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కు కేటాయించి చేతులు దులుపుకుని ప్రస్తుతం అక్కడే నిర్వహిస్తున్నారు.
దీని స్థానంలో సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహం ను శిథిలావస్థకు సిద్ధంగా ఉన్న భవనంలో దళిత విద్యార్థులను ఆ భవనంలోకి మార్చటం జరిగింది.కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దళితులు విద్యార్థులు చదువుకోవటానికి ఆపసోపనలు పడుతూ చదువు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనం యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం లోనే విద్యార్థులు నిత్యం భయం భయంగా నిద్ర పట్టటం లేదని విద్యార్థులుకూడా చదువుకోవటానికి ఆసక్తి చూపలేక నానా అవస్థలు పడుతు చదువులు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికైనా స్తానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వాళ్ళ తాత చిట్టెం నర్సిరెడ్డి, తండ్రి చిట్టెం వెంకటేశ్వర రెడ్డి (సివిఆర్) దళితులు ఆశయాలు నెరవేర్చటానికి ప్రయత్నిస్తుందా లేదా రాబోయే రోజుల్లో తేట తెల్లం అవుతుందని స్తానిక ప్రజలు చర్చించు కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఏదేని సభల్లో విద్యా, వైద్యం గూర్చి ప్రసంగం కొనసాగిస్తున్నారు. ఆచరణలో మాత్రం పెట్టలేకపోతున్నారు.
దీంట్లో భాగంగానేవసతి గృహాన్ని స్తానిక రెవెన్యూఅధికారులు, ప్రత్యేకఅధికారులు కూడా పర్యవేక్షణచేస్తున్నారు కానీ భవనం స్లాబ్పెచ్చులుడి పోతున్నసంబంధితఅధికారులు మాత్రం కనీసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొనిపోవటం కానీ చేయట్లేదు మరిఎందుకు మరిఅధికారులు మాత్రం భోజనం సదుపాయం మాత్రం పరిశీలించి భవనంమాత్రం చూడలేకపోవటమనేది చాలా విడ్డూరంగా ఉందనివిమర్శలులేకపోలేదు.
ఇక నైనాస్తానిక ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి దళిత విద్యార్థులు చదువుకోవటానికి గాను సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని కూలగొట్టి నూతన భవనాన్ని నిర్మించటానికి గాను చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయమై స్తానిక జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచలకులు అబ్దుల్ ఖలీల్ ను వివరణకోరగా జిల్లాలో ఎక్కడైతే భవనాలు ఉన్నాయో వాటి మరమ్మతులు చేయటానికి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సమాచారం నిమిత్తం పంపగా వారు అంచనాలు వేశారని త్వరలో మరమ్మత్తులు చేయిస్తామని తెలిపారు.