11-11-2025 12:25:35 AM
మొయినాబాద్, నవంబర్10 (విజయక్రాంతి); ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ తాళాలు పగుల గొట్టి ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలో గల జిల్లా, పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సాయంత్రం వరకు నడిపించి సాయంత్రం 5:20 గంటలకు తాళాలు వేసి వెళ్లారు.
వరుసగా రెండు రోజలు పాటు సెలవులు రావడంతో దుండగుల కన్ను పాఠశాల మీద పడింది. అయితే ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో పాఠశాలలో పని చేసే లక్ష్మి, ఆమె భర్త కిష్టయ్య పాఠశాలకు వెళ్లారు.అప్పటికే పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ తాళాలు రాళ్లతో కొట్టి పగుల గొట్టినట్లు వారు పరిశీలించారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. సోమవారం ఉదయం 8:30 గంటలకు పాఠశాలకు వచ్చిన రాములు కంప్యూటర్ ల్యాబ్లోనికి వెళ్లి చూశాడు.
అందులో నుంచి 5 ల్యాప్టాప్లు, ఒకటి ప్రొజెక్టర్, ఒక సీపీయూ, మౌస్లు, కీబోర్డులు, వైర్లు, మొదలైన పరికరాలు దొంగిలించినట్లు గుర్తించాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ తాళాలు పగుల గొట్టి ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలో గల జిల్లా, పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సాయంత్రం వరకు నడిపించి సాయంత్రం 5:20 గంటలకు తాళాలు వేసి వెళ్లారు.
వరుసగా రెండు రోజలు పాటు సెలవులు రావడంతో దుండగుల కన్ను పాఠశాల మీద పడింది. అయితే ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో పాఠశాలలో పని చేసే లక్ష్మి, ఆమె భర్త కిష్టయ్య పాఠశాలకు వెళ్లారు.అప్పటికే పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ తాళాలు రాళ్లతో కొట్టి పగుల గొట్టినట్లు వారు పరిశీలించారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. సోమవారం ఉదయం 8:30 గంటలకు పాఠశాలకు వచ్చిన రాములు కంప్యూటర్ ల్యాబ్లోనికి వెళ్లి చూశాడు.అందులో నుంచి 5 ల్యాప్టాప్లు, ఒకటి ప్రొజెక్టర్, ఒక సీపీయూ, మౌస్లు, కీబోర్డులు, వైర్లు, మొదలైన పరికరాలు దొంగిలించినట్లు గుర్తించాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.