calender_icon.png 20 January, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో గోల్‌మాల్!

20-01-2026 01:57:45 AM

అవినీతి, సిండికేట్లతో 41,000 మంది ఉద్యోగాలకు పొంచిఉన్న ముప్పు

కేసీఆర్ వంటి అనేకమంది ముఖ్యమంత్రుల హయాంలో రాజకీయ దోపిడీ లేకుండా సింగరేణి నిలబడిం ది. కానీ కాంగ్రెస్ పాలన మొదలైన తరువాత.. సిండికేట్లు టెండర్లను శాసిస్తున్నాయని, ఖర్చులను పెంచి సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలే నిజ మై.. సంస్థ ప్రైవేటీకరణ జరిగితే.. ఇటీవలే సగటున రూ. 1.95 లక్షల బోనస్ పొందిన 41,000 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఆరోగ్య బీమా, గృహవసతి వంటి పథకాలు అదృశ్యమవుతాయి. చివరగా కార్మికులే బాధితులవుతారు. అందుకే ఉద్యోగులు మేల్కోవాలి. మీడియాకు సరైన ఆధారాలు సమర్పించాలి.

తెలంగాణ దోపిడీ ఆగాలి. ఈ ‘సంచలన ఎపిసోడ్‘ కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చీల్చడంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించింది. నిజం గెలుస్తుందా లేక రాజకీయ ఒత్తిడిలో సమాధి అవుతుందా? ఐఏఎస్ అధికారులు ప్రజాన్యాయం కోసం కీలక పదవులను తృణీకరించి, ధైర్యాన్ని ప్రదర్శిం చాలి. సింగరేణి కేవలం బొగ్గు మాత్ర మే కాదు. అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. సిండికేట్లు గెలిస్తే.. రాష్ట్రం ఓడిపోతుంది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న నేపథ్యం లో.. జవాబుదారీతనం చూపాల్సిన సమయం ఆసన్నమైంది.

ఒకదానికొకటి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కనిపిస్తున్న రెండు అంశాలు.. ఒకటి మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రికి సంబంధించింది అయితే.. రెండోది నైనీ బొగ్గుబ్లాక్ టెండర్ల కుంభకోణం. ఈ రెండూ మీడియా రంగాన్ని కుదిపేస్తున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రి గురించి కథనాన్ని ప్రసారం చేసిన మీడియా సంస్థ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఈ తీరు జర్నలిజం ప్రమా ణాలకు అనుగుణంగా లేదు.

ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ ఈ అంశా న్ని విచారిస్తోంది. వాస్తవానికి అసలు నేరస్థులను పట్టుకుని చట్టంముందు నిలబెట్టా ల్సిన బాధ్యత సిట్‌ది. అయితే ఈ రోజుకు కూడా మీడియా సంస్థ యాజమాన్యాన్ని స్వేచ్ఛగా వదిలేశారు. కానీ జర్నలిస్టులను మాత్రం బలి పశువులనుచేసి అరెస్టు చేశారు. అయితే ఈ మీడియా కథనం మూలాలు సింగరేణి నైనీ బొగ్గు టెండర్ల కుంభకోణంలో ఉన్నాయి.

నైనీ టెండర్లను రద్దు చేస్తున్నామని, కొత్తగా బిడ్లను ఆహ్వానిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కానీ కథ ఇక్కడితో ముగియదు.. ముగియకూడదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ నుంచి రూ. 5,000 కోట్ల లూటీకి ఎవరు అనుమతించారనేదే అసలు ప్రశ్న.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం కాగా..  కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం. 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా ఏర్పడింది. ప్రస్తుతం సుమారు 41,000 మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సంస్థలో ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,394 కోట్ల భారీ లాభాన్ని సముపార్జించింది. దశాబ్దాలుగా చేపట్టిన సంస్కరణల ప్రభావంతో సింగరేణి సంస్థ ఆర్థికంగా బలపడింది.

ఈ నేప థ్యంలో తాజాగా ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్‌లో అంతర్లీనంగా ఉన్న కుంభకోణం కారణంగా తిరిగి అగాధంలో జారి పడే ప్రమాదంలో ఉంది. పారదర్శకత లోపించడం, పక్షపాతధోరణి అవలంభించారన్న గుసగుసలతో ప్రారంభమై.. రాజకీ య అంతర్గత పోరు, మీడియా యుద్ధా లు.. సిండికేట్ ఆధారిత మోసం తదితర ఆరోపణలతో ఇది పూర్తిస్థాయి సంక్షోభంగా మారింది.

అంతేకాదు, ఇదికాస్తా.. సింగరేణి ప్రైవేటీకరణ, భారీ ఉద్యోగ నష్టాల దిశగా సాగుతున్నట్టు హెచ్చరిస్తోంది. జనవరి 18న డిప్యూటీ ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ టెండర్‌ను రద్దు చేసినట్టు ప్రకటించాల్సి వచ్చిం ది. దీనితో ఈ ఎపిసోడ్ వేళ్లూనుకున్న, కుళ్లిపోయిన పాలనా వ్యవస్థను బహిర్గతం చేసింది. ఇది వేలాదిమంది జీవనోపాధిని, తెలంగాణ జాతికి చెందిన ప్రజల ఆస్తి ని దెబ్బతీసేలా సంకేతాలు పంపిస్తోంది.

కొన్ని కంపెనీలకే అనుకూలం..!

ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్‌ను 2015లో సింగరేణికి కేటాయించారు. 350 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. నైనీ కోల్‌బ్లాక్‌లో లభించే నాణ్యమైన బొగ్గుతో భారతదేశ ఇంధన భద్రతను మరింతగా బలోపేతం చేయాలని సంకల్పించారు. ఈ బొగ్గు బ్లాక్‌లో 25 ఏళ్ల పాటు రూ. 25,000 కోట్ల విలువైన టెండర్‌ను ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు వెలికితీత కోసం మైన్ డెవలపర్ ఆపరేటర్ (ఎండీవో) కోసం జారీచేశారు. అయితే మైనింగ్ అనుభవం లేని ఒక జాయింట్ వెంచర్ కంపెనీకి అనుకూలంగా ప్రీ-క్వాలిఫికేషన్ నిబంధనలను తారుమారు చేశారనే ఆరోపణలు వినవచ్చాయి.

అన్నింటికంటే కీలకమైన అనుమానాస్పద అంశం.. సింగరేణి జనరల్ మేనేజర్ జారీచేసే ‘ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్‘ తప్పనిసరి అని చెప్పడం. ఇది ఎంపిక చేసినవారికి మాత్రమే ఇచ్చారని, దీనివల్ల పోటీ కేవలం కొద్దిమంది బిడ్డర్లకు మాత్రమే పరిమితమైందని విమర్శకులు బలంగా చెబుతున్నారు. బిడ్డింగ్‌కు ఒకటి లేదా రెండు రోజుల ముందు చెల్లించాల్సిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) నిబంధనలు, కొన్ని కంపెనీలకు అనుకూలంగా ఉండటాన్ని గుర్తిం చారు. దీనితో కొన్ని కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి బెదిరింపులకు ప్రయత్నించారనే ఆరోపణలకు ఊతమిచ్చింది.

ఈ కుంభకోణం వెనుక రాజకీయ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. 2023 డిసెంబర్ నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీపడిన ఇద్దరు ఆశావహులు తమ మిత్రులకు సంబంధించిన సంస్థలకు మద్దతుగా.. టెండర్‌ను తమకు అనుకూలంగా మల్చుకోవడానికి పోటీ పడ్డారనే  ఆరోపణలు ఉన్నాయి.

టెండర్ అంచనా ధరలు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాజెక్టుల కంటే 30 శాతం అధికంగా ఉన్నాయని.. ఇదికాస్తా సింగరేణి నుండి రూ. 5,000 కోట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని.. ఈ మొత్తం సంస్థలో పనిచేసే 41 వేల మంది ఉద్యోగులకు ఏళ్ల తరబడి సంక్షేమ పథకాలకు సరిపోతుందని ఆరోపించారు. దీనిని అరికట్టకపోతే, అటువంటి కుంభకోణాలు కంపె నీని మళ్ళీ నష్టాల్లోకి నెట్టవచ్చు. 2000 సంవత్సరంలో సింగరేణిని మూసివేసే స్థాయికి తెచ్చిన ప్రైవేటీకరణ చర్యలు.. మరోసారి తెరపైకి రావచ్చు.

ఈ గందరగోళాన్ని మరింత పెంచేలా అసభ్యకరమైన మీడి యా వైరం కొనసాగుతోంది. రెండు ప్రధాన తెలుగు మీడియా సంస్థలు ఈ కుంభకోణాన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి, అందులో ఒకటి మరొకరిని దెబ్బతీసేందుకు ఐఏఎస్ అధికారిణిపై బురదజల్లింది. ఇది జనవరి 13న ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటుకు దారితీసింది, ‘తప్పుడు వార్తలు‘ ప్రసారం చేసినందుకు జర్నలిస్టులను అరెస్టు చేశారు.

తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ ఆ వార్తలను తీవ్ర వ్యతిరేక, లింగ వివక్షతో కూడినవని ఖండించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు ఒక టీవీ, ఏడు డిజిటల్ మీడియా సంస్థలపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదుచేసి, విచారణ చేసిన సిట్ పలువురు జర్నలిస్టులను అరెస్టు చేసింది.

దీనితో తటస్థ  మీడియా అనే ది ఒక అపోహగా మా రి, మీడియా సంస్థల యజమానులు తమ మనుగడ కోసం రాజకీయ నాయకులతో జ తకడుతున్న క్రీడలో జర్నలిస్టులు కేవలం బ లిపశువులుగా మా రుతున్నారని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక రు చేసిన పోస్ట్‌లో పే ర్కొన్నట్లుగా, ‘జర్నలిస్టు లు మరియు అధికారులను.. బలిపశువులుగాచేసి మీడియా యజమానులు ‘దోపిడీ’లో తమ వాటా కోసం ఎలా పాకులాడుతున్నారో ఈ తతంగం స్పష్టం చేస్తున్నది’ అనడం గమనార్హం.

 డిసెంబర్ 2025లో సింగరేణి సీఎండీగా నియమితులైన యువ ఐఏఎస్ అధికారి డీ కృష్ణభాస్కర్ ఈ వివాదంలో చిక్కుకున్నారు.  2012 బ్యాచ్ అధికారి అయిన కృష్ణ భాస్కర్‌పై ఎలాం టి అవినీతి ఆరోపణలు లేవు. ఆయన సీఎండీగా రావడానికంటే ముందే ప్రారంభమైన టెండర్ ప్రక్రియ విషయంలో.. అనుమానాస్పద నిబంధనలను ఆయన ఆమోదించారా లేదా. ఆ నిబంధనలు అంతకు ముందే నిర్ణయించారా? అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీనితో సింగరేని సీఎండీగా ఆయన కొనసాగింపు అనేది ప్రస్తుతం డోలాయమానంలో పడింది. బదిలీ జరిగితే అది రాజకీయ ప్రక్షాళనగా భావించవచ్చు. కానీ తరువాత వచ్చే ఏ అధికారి అయినా.. కేవలం ‘తమ రాజకీయ యజమానులకు సేవ చేసేందుకే ప్రయత్నిస్తారేమో’ అని విమర్శకులు ముందుగానే అనుమానిస్తున్నారు. అంతకుముందు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీగా ఆయన విద్యుత్ టెండర్లను పారదర్శకంగా నిర్వహించారు.

అయినప్పటికీ.. సింగరేణిలో పైస్థాయి నుండి మౌఖిక ఆదేశాలు వచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ నిబంధనలను ఎవరు రూపొందించారు.. ఎక్కడ నుంచి వచ్చాయి.. అనేది తెలుసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ అవశ్యకంగా కనపడుతోంది.

కేంద్రం మౌనం..

ఇంతా జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. 49 శాతం వాటా ఉన్నప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎందుకనో మౌనం పాటిస్తోంది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు జోక్యం చేసుకోవాలన్న డిమాండు వినపడుతున్నా.. వాళ్లు స్పందించడం లేదు.

గుజరాత్, ఒడిశాలోని ప్రభుత్వ సంస్థలకు నేరుగా నామినేషన్‌పై గతంలో గనులు కేటాయించడానికి పూర్తి వ్యతిరేకంగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. సమాఖ్య ప్రయోజనాలున్న అంశాలపై సరైన పర్యవేక్షణ ఎందుకు లేదు? మరోవైపు, ఐఏఎస్ అధికారిపై బురదజల్లిన కేసులో పరారీలో ఉన్న వ్యక్తులను పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసులు విఫలం కావడం చూస్తుంటే.. ఇది కేవలం ‘కంటితుడుపు‘ విచారణ అనే అనుమానాలను బలపరుస్తోంది.

సింగరేణి టెండర్లను చుట్టుకుని ఉన్న అవినీతి తతంగాన్ని గమనిస్తే నిజమైన బాధితులు ఎవరు? సింగరేణి కార్మికులేనా అనే అనుమానం కలుగకమనదు. 1990ల నాటి సమ్మెల నుండి 2000లలో ఏపీవీఎన్ శర్మ చేసిన సంస్కరణల వరకు, జవాబుదారీతనం, సంక్షేమ చర్యల కారణంగా నష్టాల నుంచి సింగరేణి సంస్థను లాభాల దిశగా మళ్ళించారు. కేసీఆర్ వంటి అనేకమంది ముఖ్యమంత్రుల హయాంలో రాజకీయ దోపిడీ లేకుండా నిలబడింది.

కానీ కాంగ్రెస్ పాలన మొదలైన తరువాత.. సిండికేట్లు టెండర్లను శాసిస్తున్నాయని, ఖర్చులను పెంచి సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలే నిజమై.. సంస్థ ప్రైవేటీకరణ జరిగితే.. ఇటీవలే సగటున రూ. 1.95 లక్షల బోనస్ పొందిన 41,000 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి.

ఆరోగ్య బీమా మరియు గృహవసతి వంటి పథకాలు అదృశ్యమవుతాయి. అంతిమంగా కార్మికులే బాధితులవుతారు. అందుకే ఉద్యోగులు మేల్కోవాలి. మీడియాకు సరైన ఆధారాలు సమర్పించాలి. రూ. 5,000 కోట్ల స్కాం జరక్కుండా అడ్డుపడి, తెలంగాణ బ్లాకుల మాదిరిగానే నైనీ ప్రాజెక్టును కూడా ప్రత్యక్షంగా అమలుచేయాలని డిమాండ్ చేయాలి.

టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన స్వాగతించదగినదే. కానీ ఇది పైపై మెరుగు మాత్రమే. సవరించిన బిడ్లలో మైనింగ్ అనుభవం, టర్నోవర్ పరిమితులు.. కనీసం 10 మంది నిజమైన బిడ్డర్లు ఉండేలా చూడాలి. నిజమైన బిడ్డర్లను నిరోధించేలా ఉన్న నిబంధనలను తొలగించాలి. సిట్ తన విచారణ పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది. 2024 నుంచి జరిగిన అన్ని టెండర్లపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి. ఆ పత్రాలను బహిరంగంగా వెల్లడించాలి. అలాగే.. సిండికేట్లు, అధికారులు, ఏజెన్సీలపై విచారణ జరపాలి. ఐఏఎస్ అధికారి గౌరవాన్ని కాపాడేందుకు మీడియా ప్రసారాలను నిషేధించాలి.

తెలంగాణ దోపిడీ ఆగాలి. ఈ ‘సంచలన ఎపిసోడ్’ కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చీల్చడంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించింది. నిజం గెలుస్తుందా లేక రాజకీయ ఒత్తిడిలో నిజం సమాధి అవుతుందా? ఐఏఎస్ అధికారులు ప్రజాన్యాయం కోసం కీలక పదవులను తృణీకరించి, ధైర్యాన్ని ప్రదర్శించాలి. సింగరేణి కేవలం బొగ్గు మాత్రమే కాదు. అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. సిండికేట్లు గెలిస్తే.. రాష్ట్రం ఓడిపోతుంది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో.. జవాబుదారీతనం చూపాల్సిన సమయం ఆసన్నమైంది.