పరీక్ష రాసి అదృశ్యమైన విద్యార్థి
శవమై కనిపించిన విద్యార్థి
మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థి మృతి
బిచ్కుంద,(విజయక్రాంతి): మైనార్టీ గురుకుల కళాశాలలో చదువుతున్న ఇంటర్వ్యూ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపు తుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ముజాహిద్ (16) గురువారం వార్షిక పరీక్ష రాశారు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ముజాహిద్ శనివారం పెద్దదడిగి గ్రామం సమీపంలోని కౌలాస్ వాగులో శవ మై కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ముజాహిద్ పరీక్ష రాసి అనంతరం ఎందుకు అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేయడం జరిగింది. మూడు రోజులకు శవమై కనిపించడం బిచ్కుందలో కలకలం రేపుతుంది. గత కొద్ది నెలల క్రితమే జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి గుంతలో పడి మృతి చెందిన ఘటన మరువకముందే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనార్టీ గురుకుల విద్యార్థి మృతి చెందడం పట్ల విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల నాయకులు గురుకుల పాఠశాల కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థుల మృత్యు వాత ఘటనలు వెలుగు చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
గురుకుల పాఠశాల కళాశాల పంపిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకొని ఎంతో భవిష్యత్తు లో ఎదుగుతారని భావించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు మృత్యువాత ఘటనలు తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్ నీస్తున్నాయి. కేవలం గురుకుల విద్యార్థులు మృతి చెందడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయని కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
గురుకుల పాఠశాలలో కళాశాలలో విద్యాబోధనలో అధ్యాపకుల క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రెండు ఘటనలు జిల్లా వ్యాప్తంగా కలకలంబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధ్యత లోపానికి కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇన్చార్యులు గారికి ఇలాంటి ఘటనలు పునారావృతంగా చూడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గురుకుల పాఠశాల కళాశాలల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.




