7 March, 2026 | 10:11 PM

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

07-03-2026 08:30 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారిణి (మంగపేట జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు) పొదెం మేనక ఆధ్వర్యంలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయం పరిపాలన దినోత్సవ ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చెందిన విద్యార్థులు ఒక రోజు పాటు పాఠశాల, పరిపాలనా బాధ్యతలను స్వీకరించారు.

పదవ తరగతి విద్యార్థిని ఎం.డీ.జువేరియా ప్రధానోపాధ్యాయురాలిగా, మరికొంత మంది వివిధ సబ్జెక్ట్ టీచర్లుగా, మినిస్టర్‌గా ఎం.డి.షబానా,  ఆర్జేడీగా నేహ నౌషిన్, జిల్లా కలెక్టర్‌గా అర్చన, జిల్లా విద్యాశాఖ అధికారిగా సమీరా, తహశీల్దార్ గా వందన, ఎంఈఓగా అసిఫా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రాంతి, నాగేందర్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, అనంతరావు, సతీష్, వెంకటేశ్వర్ రెడ్డి, సునీత, అనసూయ, రాజు, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.