calender_icon.png 25 May, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పులో కాలేసిన కాంగ్రెస్!

25-05-2025 12:50:21 AM

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తలపించిన దాడులను కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘చూట్‌పుట్ వార్ (చిన్న యుద్ధం)’గా అభివర్ణించడం సమంజసమేనా?. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడి దాడులు చేసి దాయాదిని మోకరిల్లేలా చేశాయి.

కాల్పుల విరమణ ఒప్పందం అంశం తెరమీదకు రావడంతో ఈ మినీ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకులు పడినట్టయింది. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ జరిగినన్ని రోజులు అందరిదీ ఒకటే మాట అన్నట్టుగా.. ప్రభుత్వానికి కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందించాయి.

ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర నాయకులు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే కాల్పలు విరమణ అంశం తెరపైకి వచ్చిందో అక్కడి నుంచే కథ పూర్తిగా మారిపోయింది.

‘ఆపరేషన్ సిందూర్’ పేరిట నిర్వహించిన ఆపరేషన్‌లో ఎంతమంది చనిపోయారన్న లెక్క చెప్పాల్సిన అవసరముందని.. పాక్‌పై భారత్ కేవలం చిన్నపాటి యుద్ధం మాత్రమే జరిపిందని పార్టీ అగ్రనేత ఖర్గే అనడం విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ తన వ్యాఖ్యలతో తప్పు లో కాలేసిందా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో ప్రకృతి అందాలకు నెలవైన పహల్గాంలోని బైసరన్ లోయలోకి చొరబడిన ముష్కరులు అతి కిరాతకంగా కాల్పులు జరిపి 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొనడం యావత్ దేశానికి ఆగ్రహం తెప్పించింది. ఇది చాలదన్నట్టు పాక్ ఆర్మీ ఎల్వోసీ వెంబడి భారత్ సరిహద్దు ప్రాంతాలైన  కుప్వారా, బారాముల్లా, యురి, ఆక్నూర్ ప్రాంతాల్లో విచక్షణా రహిత కాల్పులకు దిగింది.

ఈ కాల్పుల్లో 13 మంది అమాయక పౌరులు మృతి చెందగా.. 59 మంది గాయపడ్డారు. పహల్గాం ఘటన తరువాత ‘దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. వేటాడి పట్టుకొని మట్టిలో కలిపేస్తాం’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఈ క్రమంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరే ‘ఆపరేషన్ సిందూర్’.

మే 6 మధ్య అర్ధరాత్రి 1.05 గంటల నుంచి 1.30 గంటల మధ్య 25 నిమిషాల పాటు భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. మే 7న ఉదయం కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమి కా సింగ్ ఈ దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

భారత్ జరిపిన దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ప్రకటించింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌పై విరుచుకుపడడం యావత్ భారతీయుల రోమాలను నిక్కబొడిచేలా చేసింది. 

అయితే భారత సేనలు తమ భూభాగంలో దాడులు చేయడాన్ని పాకిస్థాన్ అవ మానకరంగా భావించింది. ప్రపంచం ముం దు తమ పరువు పోయిందనే భావనతో సరిహద్దు వెంట విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పలువురు సామాన్యులు మరణిం చారు.

మే 7న రాత్రి పాకిస్థాన్ సైన్యం భారత్‌లోని జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, జైసల్మేర్, పోఖ్రాన్, పఠాన్‌కోట్, జలంధర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను, మిసైళ్లను ప్రయోగించింది. అయితే ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్లను, మిసైళ్లను గగనతలంలోనే సమర్థంగా అడ్డుకొని పాక్ దాడులను తిప్పికొట్టింది.

పాక్ దాడులను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి దీటుగా బదులిచ్చింది. కేంద్ర ప్రభు త్వ ఆదేశాలతో భారత త్రివిధ దళాలు భార త అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలతో రం గంలోకి దిగి పాకిస్థాన్‌లోని రక్షణ వ్యవస్థలే టార్గెట్‌గా దాడులకు దిగింది. దీనిలో భాగం గా అత్యాధునిక ఎస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను వినియోగించి లా హోర్‌లోని క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది.

అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, పెషావర్, కరాచీ పోర్టుల్లో భారత్ వైమానిక దళం విరుచుకుపడింది. భారత్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరయిన పాక్ ఇక చేసేదేం లేక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. ఈ ఒప్పందానికి భారత్ అంగీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

‘ఆపరేషన్ సిందూర్’తో మన బలమెంటో ప్రపంచానికి చాటి చెప్పామని కేంద్ర ప్రభు త్వం పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గాం బాధితులకు న్యాయం జరిగేలా చూశామని తెలిపింది. భారత డిఫెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్చువల్‌గా బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించినట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగి నన్ని రోజులు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్.. కాల్పు ల విరమణ ఒప్పందం అనంతరం రూటు మార్చింది. ‘ఆపరేషన్ సిందూర్’తో బీజేపీకి మరింత మైలేజ్ వస్తుండడాన్ని ఓర్వలేక కాంగ్రెస్ పనిగట్టుకొని విమర్శలకు దిగడం ప్రారంభించింది.

ఈ దశలోనే భారత్, పాక్ మధ్య కాల్పుల విరామణకు  తామే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రేలాపనలు  కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు అస్త్రాన్ని అం దించాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర ఏమిటని నిలదీశాయి. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఇచ్చిన హామీ ఏమిటని, పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసేందుకు పాక్ అంగీకరించిందా అంటూ ప్రశ్నించింది.

కేంద్రాన్ని ఇరకాటం లో పెడుతున్నామని భావించిన కాంగ్రెస్.. తమ వ్యాఖ్యలతో తమ ఓటు బ్యాంకు తగ్గించుకుంటున్నామన్న విషయాన్ని గ్రహించలేక పోయింది. కాంగ్రెస్ బాటలోనే ఇండియా కూటమి పార్టీ నేతలు కూడా పయనిస్తుండడం చూస్తుంటే తప్పులో కాలేస్తున్నాయ అన్న అనుమానం రాక మానదు. 

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగినన్ని రోజులు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్.. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం రూటు మార్చింది. ‘ఆపరేషన్ సిందూర్’తో బీజేపీకి మరింత మైలేజ్ వ స్తుండడాన్ని ఓర్వలేక కాంగ్రెస్ పనిగట్టుకొని విమర్శలకు దిగడం ప్రారంభించింది.

ఈ దశలోనే భారత్, పాక్ మధ్య కాల్పుల విరామణకు  తామే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రేలాపనలు  కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు అస్త్రాన్ని అందించాయి. కాల్పు ల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర ఏమిటని నిలదీశాయి. 

రేవంత్ తీరు వేరు

ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీలో గుడ్డిలో మెల్ల ఏదైనా ఉందంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు అని చెప్పొచ్చు. పహల్గాం ఉగ్రదాడిని మొదటి నుంచి ఖండిస్తూ వచ్చిన రేవంత్ వైఖరి ఆ పార్టీ నేతలకు కాస్త భిన్నంగా సాగింది. పాక్‌పై మినీ యుద్ధంలో సాధించిన విజయానికి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తిరంగా జెండా’ యాత్రకు సంపూర్ణ సహకారం అందించారు.

అంతేకాదు భారత డిఫెన్స్ వ్యవస్థ పాక్ శిబిరాలపై జరిపిన దాడిని మెచ్చుకుంటూ వారికి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ తీసిన ఆయన దేశానికి కష్టం వస్తే అందరం ఒక్కటేనని చాటి చెప్పారు. ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయ ప్రత్యర్థులమని.. దేశం కష్టాల్లో ఉన్న సమయంలో అంతా ఐక్యంగా ఉంటామని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకరిస్తున్న కేంద్రానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి హూందాతనాన్ని ప్రదర్శించారు.