వార్డు సభ్యుల సామర్థ్య వృద్ధికి అవగాహన సదస్సు
ఎంపీడీఓ చిన్న రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిషత్ సమావేశ మందిరంలో వార్డు సభ్యుల కోసం నిర్వహించిన రెండవ శిక్షణ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ చిన్న రెడ్డి, ఎంపీవో విజయపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ తదితరులు హాజరై వార్డ్ సభ్యులకు శక్షణ పత్రాలను అందించడం జరిగింది.
ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ... గ్రామ పంచాయతీల విధులు, వార్డు సభ్యుల బాధ్యతలు, అభివృద్ధి పనుల అమలు విధానం, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగం, వంటి అంశాలపై వార్డ్ సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారుల సూచనలు చేశారు.
ఎంపీడీఓ చిన్న రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని, సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. ఎంపీవో విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో, పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని అభివృద్ధి పనుల్లో సాంకేతిక ప్రమాణాలు పాటించడం, నిధుల సరైన వినియోగం చేయడం ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఇతర సంబంధిత శాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీ లు పాల్గొన్నారు.




