2 May, 2026 | 6:50 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

రైతులకు పంటలపై అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు

02-05-2026 05:26 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామపంచాయతీ కార్యాలయం లో శనివారం మండల వ్యవసాయ అధికారి పైడితల్లి ఆధ్వర్యంలో  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పార్స్, పొలాస నుండి శాస్త్రవేత్తలు  డాక్టర్ జి.వేణుగోపాల్, డాక్టర్ జయంత్  పాల్గొని రాబోయే వానకాలంలో వేసే వరి పంటలో అనువైన రకాలపై అవగాహన కల్పించారు. మార్కెటింగ్ డిమాండ్ ఉన్న ఇతర వాణిజ్య పంటల అమ్మకంలో  మార్కెట్ వివరాలు, నానో ఎరువుల వాడకం గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉత్తమకుమారి, ఏ ఈ ఓ డి. ప్రశాంత్, ఉప సర్పంచ్ , రైతులు పాల్గొన్నారు.