2 July, 2026 | 12:20 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్‌సీవో పత్రం

27-06-2025 12:50 AM
  1. సంతకానికి రాజ్‌నాథ్ నిరాకరణ
  2. అంతర్జాతీయ వేదికగా దాయాదిపై రక్షణమంత్రి విమర్శలు

న్యూఢిల్లీ, జూన్ 26: చైనాలోని కింగ్‌దావోలో గురువారం జరిగిన షాంఘై సహ కార సంస్థ (ఎస్సీవో) రక్షణమంత్రుల సమావేశంలో ఉగ్రవాదం విషయంలో భారత్ తన వైఖరిని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటిచెప్పింది. ఉగ్రవాద నిర్మూలన, ప్రాం తీయ భద్రత వంటి అంశాలపై రూపొందించిన ఉమ్మడి ప్రకటనలోని కొన్ని ప్రతిపా దనలు భారత ప్రయోజనాలకు, వైఖరికి విరుద్ధంగా ఉండటంతో, దానిపై సంతకం చేసేందుకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిరాకరించారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడు కుంటున్నాయని పరోక్షంగా దాయాది పాక్ ను దుయ్యబట్టారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజ్‌నా థ్‌సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం, ఉగ్రవాదం పై, ప్రత్యేకించి సరిహద్దు ఉగ్రవాదంపై భార త కఠిన వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేశా యి.

సమావేశం అనంతరం విడుదల చేయాలని భావించిన ఉమ్మడి ప్రకటన ముసాయి దాలో, ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రస్తావన లేకపో వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.

అదే సమయంలో, పాక్ పదేపదే ఆరోపిస్తున్న బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ కార్యకలాపాల గురించి పరోక్షంగా ప్రస్తావించే ప్రయత్నాలు జరిగాయని, దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని స మాచారం. ఉగ్రవాద అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎస్‌సీవో ఎలాంటి ఉమ్మడి ప్రకటనను జారీ చేయకుండానే సమావేశం ముగిసింది.