calender_icon.png 14 July, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం

27-06-2025 12:52:31 AM

  1. ‘ఆపరేషన్ చక్ర-V’ పేరుతో ఐదు రాష్ట్రాల్లో సోదాలు
  2. 42 ప్రదేశాల్లో దాడులు.. 9 మంది అరెస్టు
  3. యుపీఐ ద్వారా నేరాలకు పాల్పడిన మోసగాళ్లు

న్యూఢిల్లీ, జూన్ 26: సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ చక్ర-V’ పేరుతో ఐదు రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ పేర్కొంది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది.

దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూ ల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం తో సీబీఐ దాడులు నిర్వహించింది. కాగా మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మో సాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల ఖాతాల నుంచి వచ్చిన అక్రమ నిధులను బదిలీ చేయడానికి, ఉపసంహరించడానికి ఈ మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్టు సీబీఐ గుర్తించింది.

ఈ దాడుల్లో సీబీఐ.. మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన వా రిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరస్పాండెంట్లు ఉన్నారు. సైబర్ నేరగాళ్ల తమ అక్ర మ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయడానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి సొత్తును అందులో కి మళ్లిస్తారు. దీనికి ప్రతినెలా సదరు ఖాతాదారుడికి కొంత మొత్తం చెల్లిస్తుంటారు. ఇ లాంటి ఖాతాల్ని మ్యూల్ ఖాతాలు అని పిలుస్తారు.