తొలి విడతలో 41,285 మందికి సీట్లు
- 13న ఫేజ్-2 సీట్ల కేటాయింపు
- ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్లు
- జూన్ 30 నుంచి తరగతులు
- వెల్లడించిన అధికారులు
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): దోస్త్ మొదటి విడతలో 60,428 సీట్లను కేటాయిస్తే కాలేజీల్లో చేరింది మాత్రం 41,285 మంది విద్యార్థులే. దాదాపు 20 వేల మంది విద్యార్థులు జాయిన్ కాకపోవడం గమనార్హం. తొలి విడుతలో మంచి కాలేజీల్లో సీట్లు లభించని కారణంగానే విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరలేదని అధికారులు తెలిపారు. వీరంతా రెండో విడతలో పాల్గొననున్నారు.
ఈనెల 13న దోస్త్ ఫేజ్-2 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. ఫేజ్-2కు 35,954 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఫీజు చెల్లించినవారు 33,409 మంది ఉన్నారు. దరఖాస్తులు నింపినవారు మాత్రం 34, 276 మంది కాగా, వెబ్ ఆప్షన్లు 46,886 ఇచ్చుకున్నారు. సీట్ల కేటాయింపు తర్వాత స్పాట్ అడ్మిషన్లు చేపడుతామని అధికారులు తెలిపారు. జూన్ 30 నుంచి తరగతులు ప్రారం భమవుతాయని వెల్లడించారు.




