11-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. జూన్ 18 నుంచి జూలై 8వ తేదీ వరకు చేపట్టాల్సిన ధృవపత్రాల పరిశీలనను వాయిదా వేస్తున్న ట్లు ప్రకటించింది. గ్రూప్-3 ప్రక్రియ ప్రారంభించేందుకు ముందు గ్రూప్-2 నియామక ప్రక్రియను పూర్తి చేయాల ని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.