2 July, 2026 | 12:18 AM

గాయత్రి దేవి అలంకరణలో త్రిశక్తులు

23-09-2025 06:04 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాల్లో  భాగంగా రెండవ రోజు అమ్మవార్లు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ దేవి మంత్రం జపంతో జ్ఞాపకశక్తి బుద్ధి పెరుగుతాయని, ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి  అమ్మవార్లను నారింజ రంగు వస్త్రాలతో అలంకరించి  ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.