2 July, 2026 | 1:21 AM

బతుకమ్మ సంబరాలపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు

23-09-2025 06:05 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ చిత్రలేఖనం వ్యాసరచన పోటీలను షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ మండల పరిధిలో ఈ పోటీలు ఉంటాయని పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు చదివించుకోవాలని కోరారు.