calender_icon.png 23 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కుంభం చొరవతో బునాదిగాని కాలువ గండి పూడ్చివేత

23-09-2025 06:01:18 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామంలో గల బునాదిగాని చెరువులోకి వచ్చే కాలువకు ఎర్రబెల్లి సమీపంలోని నార్లకుంట వద్ద గండి పడింది. ఈ విషయాన్ని రైతులు వెంటనే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే కుంభం ఆదేశాలతో వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ ఎంపిటిసి గాడిపళ్లి యాదయ్య ఆధ్వర్యంలో జెసిబిలతో గండి పడిన ప్రాంతాన్ని గత రెండు రోజులుగా నిరంతరం శ్రమించి పూడ్చివేశారు. దీంతో కాల్వ ద్వారా చెరువు ద్వారా సాగునీరు ఉపయోగించుకునే రైతులంతా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.