రాజ్యాంగ పరిరక్షణకై లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలి
తాడ్వాయి, ఏప్రిల్, 14( విజయ క్రాంతి): రాజ్యాంగ పరిరక్షణకై లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.
ఈ సందర్భంగా తాడువాయి మండల కేంద్రంలో, ఎర్ర పహాడ్, నందివాడ,ఎండ్రియాల్, దేమికలాన్, కన్ కల్, కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, బ్రహ్మాజీ వాడి, చిట్యాల గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘం నాయకులు, కార్యకర్తలు, గ్రామాల సంఘాల కార్యకర్తలు, సర్పంచులు విజయ రాములు, సంకు పోచయ్య, రవీందర్ రెడ్డి, మంగారెడ్డి, నర్సింలు ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబర్‌పేటలో ..
దోమకొండ, ఏప్రిల్ 14(విజయ క్రాంతి): దోమకొండ మండలంలోని అంబర్పేట గ్రామంలో మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్యగౌడ్, గ్రామ కార్యదర్శి పద్మ, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అంబేద్కర్ సంఘ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






