అంబేద్కర్‌నాలెడ్జ్ హబ్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి ఏప్రిల్ 14( విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితోనేపేద ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వివరించారు. భవిష్యత్తులో పెద్దపల్లి మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు.
అంబేద్కర్ నాలెడ్జ్ హబ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఆధునిక హంగులతో హబ్ సెంటర్ ఏడాదిలోపు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని కలెక్టర్ కు సూచించారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు , రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






