21 April, 2026 | 1:29 AM

జలాశయాల వద్ద భద్రతా చర్యలు

21-04-2026 12:15 AM

సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 20 : పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జలాశయాల వద్ద ప్రమాదాలను నివారించేందుకు, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సరైన రక్షణ చర్యలు లేక ఇటీవల అనేక చోట్ల ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని ప్రమాదకరమైన నీటి ప్రాంతాలను గుర్తించి,  స్పష్టంగా కనిపించే విధంగా హెచ్చరిక బోర్డులు, డేంజర్ ఇండికేటర్లను ఏర్పాటు చేయాలని అదేశించారు.

బహిరంగంగా ఉన్న బావులు, లోతైన నీటి కుంటల చుట్టూ రక్షణ కంచెలు లేదా గోడలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారని తెలియజేశారు. సిద్దిపేట పోలీసు శాఖ చేపట్టిన ఈ భద్రతా చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.