29 May, 2026 | 1:42 AM

వినేశ్‌పై సుప్రీంకు రెజ్లింగ్ సమాఖ్య

29-05-2026 12:00 AM

న్యూఢిల్లీ, మే 28: ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ 2026లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అనుమతిపై భారత రెజ్లింగ్ సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల నుంచి ఈ న్యాయ వివాదం మొదలైంది. ఆ ఉత్తర్వులో రాబోయే సెలక్షన్ ట్రయల్స్‌లో పోటీ పడేందుకు ఫొగాట్‌కు అనుమతి లభించింది. మే 30, 31 తేదీల్లో ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ జరగనున్నాయి.