24-05-2025 12:36:24 AM
- రైతులకు నష్టం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు
- విత్తనాల విక్రయం లో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు శిక్షణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
- రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి
పెద్దపల్లి, మే -20 (విజయ క్రాంతి); పెద్దపల్లి జిల్లాలోని రైతులకు నిబంధనలను పా టిస్తూ విత్తనాలను విక్రయించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మం దిరంలో విత్తనాల విక్రయం లో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డిసిపి కరుణాకర్, రాష్ట్ర విత్త న అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో విత్తనాల డీలర్లు నిబంధనలు పాటి స్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్ర మే అమ్మాలని, రాబోయే సీజన్ లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని,జిల్లాలో రాబోయే వానాకా లం సాగుకు అవసరం అయ్యే విత్తనాలు ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా అక్కడ ఆ విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్య లు చేపట్టాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
వానాకాలం పంట కు అవసరమైన ఎరువులు, డీఏపి టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని, డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలను ఈ పాస్ యంత్రాల్లో అప్ డేట్ చేయాలని, ఎరువుల లభ్యత పై అసత్య ప్రచారాలు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. గ్రీన్ మ్యాన్యుర్ స్టాక్ ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, గత 2 సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం రెండింతలు అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అకాల వ ర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా పంట కాలాన్ని రెండు వారాలు ముందుకు జరపాలని కోరుతున్నామని, దానికి అనుగుణంగా అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో పెట్టుకోవాలని, రైతులకు ఎ రువులు విత్తనాలు విక్రయించే సమయంలో పంట కాలాన్ని రెండు వారాల పాటు ముం దుకు జరుపడం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, నకిలీ విత్తనాలు అమ్మే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని,రైతులకు విత్తనాలు అమ్మే సమయం లో నిబంధనలను తూచ తప్పకుండా పా టించాలని అన్నారు.
విత్తనాల బ్యాగ్ పై లేబుల్, నిల్వ చివరి గడుపు తేదీ మొదలగు వివరాలకు స్పష్టంగా తెలియజేసి అమ్మాలని అన్నారు. విత్తనాల అమ్మకం రికార్డ్ వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని,విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్లు, రిటై లర్లు మాత్రమే విక్రయించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ పరిధిలో ఎవరైనా అనధికారంగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే సంబంధిత డీలర్ల నుంచి రైతులకు శాస్త్రీయంగా నష్టపరిహారం అంచనా వేసి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
రైతులకు నేరుగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ నుంచి నాణ్యమైన విత్తనాలు: రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నేరుగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ నుంచి నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కృషి చేస్తున్నామని, డీలర్లు సైతం ఈ విషయంలో పూర్తి స్థాయి సహాకారం అందించాలని అన్నారు. రైతులకు ఎక్కడ నష్టాలు రాకుండా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని,
రైతులకు ఊరు పేరు లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని అన్నారు. దిగుబడి కూడా ప్రభుత్వ రంగ సంస్థలో తయారు చేసిన విత్తనం బాగా ఉందని అన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం విత్తనాల రకాలు అందుబాటులో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లాలో కనీసం పదివేల క్వింటాళ్లు ప్రభుత్వ రంగ విత్తనాలు అమ్మాలని డీలర్లకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు,తదితరులు పాల్గొన్నారు.