calender_icon.png 24 May, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి

24-05-2025 12:54:23 PM

హైదరాబాద్: కేసీఆర్.. అభివృద్ధి పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకున్నారని మహబూబ్​నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar BJP MP DK Aruna) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని డీకే అరుణ(DK Aruna) విమర్శించారు. కేంద్రప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఆమె వివరించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని పాలమూరు ఎంపీ సూచించారు. కాంగ్రెస్(Congress party) పార్టీ.. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలకు ఆపరేషన్ సింధూర్ విశ్వాసం కల్పించిందని అరుణ వెల్లడించారు.