24-05-2025 12:38:23 AM
- అకాల వానలతో తడిసిన ధాన్యం
- మొలకలు రావడంతో లబోదిబో
- ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి
కరీంనగర్, మే 23 (విజయ క్రాంతి): గత రెండు రోజులుగా మోస్తారు నుంచి కురుస్తు న్న వర్షాలకు వరిధాన్యం తడిసి ముద్దయింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయింది. ఇక్కడ ధాన్యం తడిసి మొలకలెత్తడం జరిగింది. కొ నుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం, తూకం వేసిన తర్వాత రవాణాకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది.
కొనుగోలు చివరి దశలో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారి వరకు వర్షం దంచి కొ ట్టింది. అత్యధికంగా రుద్రంగిలో 4.71 సెంటిమీటర్లు, చందుర్తిలో 3.18, వేములవాడలో 3.59, వీర్నపల్లిలో 3.5, ఎల్లారెడ్డి పేటలో 4.27, తంగళ్లపల్లిలో 3.37 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.
శుక్రవారం సా యంత్రం కూడా వర్షం కురిసింది. జిల్లాల వా రీగా చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3.01 సెంటి మీటర్లు, కరీంనగర్ జిల్లాలో 2.74, జగిత్యాలలో 4.18, పెద్దపల్లిలో 3.52 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. ఇది సాధారణం కంటే ఎక్కువ. రా జన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం ఉదయం వాన దంచికొట్టగా, జగిత్యాల జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజా ము వరకు అత్యధిక వర్షపాతం నమోదయింది. జగిత్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నీరు రోడ్ల పైకి వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హు స్నాబాద్ నియోజకవర్గంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం వేల క్వింటా ళ్లు ఉండడంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
- ఎల్కతుర్తి రోడ్డు పనులను వేగవంతం చేయండి: మంత్రి పొన్నం ఆదేశం....
వర్షం ప్రభావం వల్ల దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతు ర్తి నుండి సిద్దిపేట వరకు కొనసాగుతు న్న జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటీ పూర్తి కాకపోవడంతో హుస్నాబాద్ లో వ ర్షంతో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రహదారులు వర్షానికి దెబ్బతినకుండాచర్యలు చేపట్టాలని సూచించారు.