1 May, 2026 | 3:32 AM

అదనపు కలెక్టర్‌గా సీతారామారావు సేవలు మరువలేనివి

01-05-2026 12:46 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): అదనపు కలెక్టర్ గా సీతారామరావు అందించిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనియాడారు. గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు పదవి విరమణ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిబద్ధతతో కష్టకాలంలో కూడా సంయమనంతో సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలోఆయన చూపిన చొరవ అద్భుతమన్నారు.

సహోద్యోగులకు, కింది స్థాయి సిబ్బందికి ఎప్పు డూ దిక్సూచిలా నిలిచారన్నారు. ఆయన పని తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాన్య ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా  సానుభూతి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించే శైలి జిల్లా పరిపాలనలో ప్రత్యేక ముద్ర వేసిందన్నారు. పదవీ విరమణ అనేది కేవలం ఒక బాధ్యత నుండి విరామం మాత్రమే కానీ అనుభవానికి, జ్ఞానానికి అది కొత్త నాంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీవోలు  సూర్యాపేట, కోదాడ హుజూర్నగర్ వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.