1 May, 2026 | 2:03 AM

ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్

01-05-2026 12:45 AM

సదాశివపేటలో 15 వేల తీసుకుంటూ దొరికిన ఉద్యోగి

సదాశివపేట, ఏప్రిల్ 30: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా నిఖిల్‌రెడ్డి పని చేస్తున్నాడు. ఓ బాధితుడు తన ఇంటికి సంబంధించిన టాక్స్ డబ్బులు గతంలో రూ.41 వేలు ఉండేదని, ప్రస్తుతం అది కాస్త రూ.1,0,4000 పెరగడంతో అంత పెద్ద మొత్తం చెల్లించలేనని మొరపెట్టుకున్నాడు. రూ.50 వేలకు ఇంటి పన్ను తగ్గిస్తానని దానిపై తనకు రూ.35 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు కొద్ది రోజుల కిత్రం రూ.20 వేలు మొదటి విడతగా అందజేశాడు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మరో రూ.15 వేలు లంచం తీసుకుంటూ నిఖిల్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.